News January 14, 2025

జగ్గన్నతోటలో భారీ బందోబస్త్: సీఐ

image

అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 15న నిర్వహించే ప్రభల తీర్థానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 372 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పి.గన్నవరం సీఐ భీమరాజు సోమవారం తెలిపారు. ఏడుగురు సీఐలు, 23 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 230 మంది పోలీసులు, 80 మంది హోంగార్డులను నియమించామన్నారు. ఎస్ఐ చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ టీమ్ తీర్థంలో సంచరిస్తారన్నారు.

Similar News

News February 7, 2025

తూ.గో: రేపు 6రైళ్లు రద్దు.. మరో 13 దారి మళ్లింపు

image

విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల కారణంగా ఈనెల 8న జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసి 13 రైళ్లను దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. విజయవాడ- రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం-విజయవాడ (67262/61), విజయవాడ-రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం- విజయవాడ (67202/01), కాకినాడ పోర్ట్‌- విజయవాడ, విజయవాడ- కాకినాడ (17258/57) రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.

News February 6, 2025

గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

నిడదవోలు: జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య 

image

నిడదవోలు చిన్నకాశీరేవులో చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆతుకూరి లింగేశ్వరరావు(44) అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. 10 ఏళ్ల నుంచి భార్య తనతో విడిపోయి దూరంగా ఉంటుందనే బాధతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చిన్నకాశీరేవులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

error: Content is protected !!