News March 29, 2025
జగ్గన్నపేటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓపెన్ టెక్స్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెనుకబడిన ములుగు జిల్లాలో గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడానికి స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Similar News
News November 27, 2025
WNP: రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు (RO) కీలక సూచనలు చేశారు. నిర్దేశించిన పత్రాలు లేని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకుండా, వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. నామినేషన్లను పక్షపాతం లేకుండా, జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
News November 27, 2025
పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇవాళ జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఇటు ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ స్థాయికి ఎదిగారు.
News November 27, 2025
ఈ కంపెనీల అధిపతులు మనవాళ్లే!

ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే అధిపతులుగా ఉన్నారు. అందులో కొందరు.. ఆల్ఫాబెట్ Google- సుందర్ పిచాయ్, Microsoft-సత్య నాదెళ్ల, Youtube-నీల్ మోహన్, Adobe -శంతను నారాయణ్, IBM-అరవింద్ కృష్ణ, Novartis -వసంత్ నరసింహన్, Micron Technology- సంజయ్ మెహ్రోత్రా, Cognizant- రవి కుమార్, వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్- రేష్మా కేవల్‌రమణి, Infosys-సలీల్ పరేఖ్, World Bank-అజయ్ బంగా.


