News June 25, 2024

జగ్గయ్యపేటలో డయేరియాకు కారణమిదే.!

image

జగ్గయ్యపేటలో డయేరియా కేసుల నమోదైన నేపథ్యంలో 26 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు NTR జిల్లా డీఎంహెచ్‌వో సుహాసిని చెప్పారు. క్లోరినేషన్ చేయని నీటిని తాగిన కారణంగానే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కొందరు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్ర ఆహారం తీసుకున్నట్లు చెప్పారు. అతిసారం వ్యాపించిన ప్రాంతాల్లోని ప్రజలు కొన్నిరోజులు మాంసాహారం తినొద్దని సూచించినట్లు ఆమె వివరించారు.

Similar News

News November 28, 2024

పూర్తైన ఫ్లైఓవర్ పనులు.. మరింత వేగంగా హైదరాబాద్‌కు రాకపోకలు

image

విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిలో భాగమైన ప్రధాన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదిపై సూరయపాలెం-వెంకటపాలెం మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు ఫినిషింగ్ పనులు, బీటీ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ వంతెన పూర్తై బైపాస్ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ రాకుండా జాతీయ రహదారిపైకి వెళ్లవచ్చు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 

News November 28, 2024

నేడు విజయవాడకు రానున్న ‘దేవకీనందన వాసుదేవ’ టీమ్

image

“దేవకీనందన వాసుదేవ” చిత్రబృందం నేడు విజయవాడ రానున్నారు. చిత్ర హీరో గల్లా అశోక్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన పలువురు ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుంటారని కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం నుంచి ట్రెండ్‌సెట్ మాల్ వరకు మూవీ టీం ర్యాలీ, అనంతరం 6 గంటలకు ట్రెండ్‌సెట్ మాల్‌లో కేక్ కటింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

News November 27, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష కేంద్రాలలో మార్పులు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.