News July 10, 2024

జగ్గయ్యపేట ఘటన.. రెండుకు చేరిన మృతుల సంఖ్య

image

మండలంలోని బుధవాడ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బానోతు స్వామి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.

Similar News

News October 14, 2024

నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!

image

కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు. అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

News October 14, 2024

విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.

News October 13, 2024

విజయవాడలో సందడి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్

image

విజయవాడలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేశారు. ఓ నగల దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. షోరూమ్‌ను విజయవాడ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని భాగ్యశ్రీ అన్నారు. దీంతో ఆమెను చూడటానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు.