News February 28, 2025
జగ్గయ్యపేట: చెరువు బజార్లో దారుణ హత్య

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి అమావాస్య సందర్భంగా దేవతామూర్తుల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. పాత కక్షల నేపథ్యంలో శ్రీను (27) అనే వ్యక్తిని ప్రత్యర్థులు పీక కోసి హత్య చేశారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News October 30, 2025
చరిత్రలో భారీ లేఆఫ్స్ ఇవే..

కరోనా తర్వాత అగ్రశ్రేణి కంపెనీల్లోనూ లేఆఫ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగించిన అమెజాన్.. మరో 16వేల మందిపై వేటుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని సంస్థలు నష్టాల వల్ల భారీ లేఆఫ్స్ ఇచ్చాయి. 1993లో IBM 60వేల జాబ్స్, సిటీ గ్రూప్ 2008-09లో 75K, 2009లో జనరల్ మోటార్స్ 47K, 2012-15లో హ్యూలెట్-ప్యాకర్డ్ 55K ఉద్యోగాలకు కోత పెట్టాయి.
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.


