News April 2, 2025

జగ్గయ్యపేట: బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

image

జగ్గయ్యపేట మండలం బోదవాడ తండాలో బాలికపై ఓ దుండగుడు మంగళవారం అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఘటనకు పాల్పడిన వ్యక్తిని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

MBNR: స్థానిక ఎన్నికలు.. పలు పరీక్షలు వాయిదా

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1,3,5 సెమిస్టర్ పరీక్షలను స్థానిక ఎన్నికల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన పరీక్షలను 18 తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.

News December 9, 2025

పాకిస్థాన్‌కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

image

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్‌ను తప్పించుకుంది.

News December 9, 2025

ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.