News April 2, 2025
జగ్గయ్యపేట: బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

జగ్గయ్యపేట మండలం బోదవాడ తండాలో బాలికపై ఓ దుండగుడు మంగళవారం అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఘటనకు పాల్పడిన వ్యక్తిని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 24, 2025
గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి

పుణె వేదికగా జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. ఫైనల్ రౌండులో బల్గేరియాకు చెందిన నుర్గుయిల్‌పై 1-0 తేడాతో విజయం సాధించారు. తుదిపోరు ముగిసే సమయానికి జు జినర్(చైనా)తో కలిసి ఆమె టాప్‌లో ఉన్నారు. అయితే టై బ్రేక్ ఆధారంగా హంపిని విజేతగా నిర్ధారించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను డ్రాగా ముగించారు.
News April 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 24, 2025
KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.