News October 10, 2024

జగ్గయ్యపేట వ్యక్తికి వైసీపీలో కీలక పదవి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటూరి చిన్నా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.

Similar News

News November 1, 2024

విజయవాడ: తాళం వేసి ఊరెళుతున్నారా? మీకోసమే!

image

తాళం వేసి ఉన్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి నిరంతర పోలీసుల పర్యవేక్షణలో ఉండేలా రూపొందించిన “లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(LHMS)”పై విజయవాడ పోలీసులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదుపాయం పొందేందుకు LHMS AP Police యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, వివరాలకు 9440906878 నంబరుకు కాల్ చేయాలని వారు కోరారు. ఈ సేవలలో భాగంగా తాళం వేసి ఉన్న గృహాల భద్రతకై పోలీసులు ఉచితంగా నిఘా కెమెరాను అమర్చుతారన్నారు.

News November 1, 2024

నాగాయలంకలో వింత ఘటన 

image

నాగాయలంక మండలం ఈ కొత్తపాలెం గ్రామంలో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనివ్వడం గ్రామ ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. కాగా ఈ వింత ఘటన చూడడానికి గ్రామ ప్రజలు బారులు తీరారు. యజమాని మాట్లాడుతూ.. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. 

News November 1, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ 

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విశాఖ-విజయవాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08567 విశాఖ-విజయవాడ, నం.08568 విజయవాడ-విశాఖ రైళ్లను ఈ నెల 1,3,4,6,8,10,11,13 తేదీలలో 2 వైపులా నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 10 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కం దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు గన్నవరంలో ఈ రైళ్లు ఆగుతాయి.