News May 21, 2024
జగ్గయ్యపేట: వ్యభిచార గృహంపై దాడి
జగ్గయ్యపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని తొర్రకుంటపాలెంలో ఓ మహిళ గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జానకి రామ్, పట్టణ-1 ఎస్సై సూర్యభగవాన్, సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
Similar News
News December 9, 2024
మచిలీపట్నం: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కృష్ణాజిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కార చర్యల నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు.
News December 9, 2024
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కుటుంబ సభ్యుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సత్యనారాయణపురం పోలీసుల వివరాల మేరకు.. ఓ బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుంది. వరుసకు బాబాయ్ కొడుకు అయినా కార్తీక్ అనే యువకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 9, 2024
విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 10లోపు https://aaiclas.aero/career వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని, ఎంపికైన వారికి తొలి ఏడాది ప్రతి నెలా రూ.30వేల వేతనం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.