News March 21, 2025
జడ్చర్లలో యూపీ వాసి మృతి

ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యూపీకి చెందిన విశ్వకర్మ(20), నిఖిల్ జైస్వాల్(19)లు పని మీద స్కూటీపై మెడికల్ షాప్కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఆటో ఢీకొట్టింది. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న నిఖిల్ను యూపీ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
Similar News
News April 2, 2025
గ్యాంగ్ రేప్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

ఊరుకొండ పేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళల భద్రత అంశం ఆందోళన కలిగిస్తోందని BRS నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు పక్కాగా దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.
News April 1, 2025
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్కు తీవ్రగాయాలై మృతిచెందారు.