News March 21, 2025

జడ్చర్లలో యూపీ వాసి మృతి

image

ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యూపీకి చెందిన విశ్వకర్మ(20), నిఖిల్ జైస్వాల్(19)లు పని మీద స్కూటీపై మెడికల్ షాప్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ఆటో ఢీకొట్టింది. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిన్న నిఖిల్‌ను యూపీ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.

Similar News

News April 24, 2025

MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

image

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.

News April 24, 2025

తుపాకీ గురిపెట్టిన MBNR ఎమ్మెల్యే

image

ఏనుగొండలో మల్టీ స్పోర్ట్స్ ఏరియాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫిస్టల్‌ను ఎమ్మెల్యే తన చేతులతో ఎక్కుపెట్టి ఉత్సాహపరిచారు. అన్ని క్రీడలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

MBNR: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

image

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

error: Content is protected !!