News April 1, 2025
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు.
Similar News
News November 22, 2025
UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%
News November 22, 2025
MBNR: పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బీఏ,బీకాం,బీఎస్సీ, బీబీఏ బీఎ(L) (CBCS) సెమిస్టర్-I, III, V రెగ్యులర్, బ్యాక్‌లాక్ ఎగ్జామినేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్‌కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో ఆర్డర్ కాపీలను అందజేశారు. వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు.
News November 22, 2025
MBNR: డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి నిర్వహించి డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కేంద్రాలకు వెళ్లే ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కంట్రోలర్ డా కె ప్రవీణ తెలిపారు.


