News August 1, 2024

జడ్చర్ల : ‘అప్పుచేసి ఇల్లు కట్టాను.. ఏడవకండి’

image

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 44వ జాతీయ రహదారికి సమీపంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఇటీవల ఓ ఇంటి యజమాని ఇల్లు కట్టాడు. ఇంటికి నరదృష్టి పడకూడదని ఉద్దేశంతో.. ‘ఇల్లు అప్పు చేసి కట్టాను.. ఏడవకండి’ అని ఫ్లెక్సీ కట్టాడు. దీంతో ఆ ఫ్లెక్సీని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఫ్లెక్సీ చూసిన వారంతా.. ఇలా కూడా ఫ్లెక్సీ కడతారా అంటూ.. నవ్వుకుంటున్నారు.

Similar News

News November 20, 2025

కోయిలకొండ: ఎంపీడీవోల యూనియన్ అధ్యక్షుడిగా ధనుంజయ గౌడ్

image

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

News November 20, 2025

MBNR: రేపు డయల్ యువర్ RM

image

ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News”తో తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 20, 2025

మహబూబ్ నగర్: ఎస్పీ కీలక ఆదేశాలు జారీ

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రోడ్లపై ధాన్యం మారపోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ధాన్యంపై నల్లని కవర్లు కప్పడం వాటిపై రాళ్లని పెట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ముందున్న అడ్డంకి గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.