News November 6, 2024
జడ్చర్ల: అమ్మాయి అనుకున్నారు.. కానీ ట్రాన్స్‌జెండర్

ట్రాన్స్‌జెండర్‌ని యువకులు అపహరించే ప్రయత్నం చేసిన ఘటన జడ్చర్ల బస్టాండులో జరిగింది. సోమవారం రాత్రి కొందరు యువకులు ట్రాన్స్‌జెండర్‌ను యువతి అనుకొని మభ్య పెట్టి బైక్‌పై ఎక్కించుకుని కొత్తపల్లి ఇసుక క్వారీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన కొందరు వారిని అడ్డుకుని 100 సమాచారం అందించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని ఆమె వివరాలు అడగగా నల్గొండ జిల్లాకి చెందినట్లుగా తెలిపింది. యువకులు పరారయ్యారు.
Similar News
News November 12, 2025
MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
News November 12, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.


