News February 25, 2025

జడ్చర్ల: ఆటో, బైక్‌ ఢీ.. యువకుడికి గాయాలు

image

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 21, 2025

మహబూబ్‌నగర్: ఎండిన వరి పొలాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోచమ్మ గడ్డ తండాలో రైతు బిక్యా నాయక్‌కు చెందిన మూడెకరాల వరి పొలాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. భూగర్భ జలాలు పడిపోవడంతో వరి పంట ఎండిపోయిందని, రైతులకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వ్యవసాయం ఎలా చేసుకోవాలో అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలియజేయాలన్నారు. వారికి సూచనలు, సలహాలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీ ఆంజనేయులు ఉన్నారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్: ‘పెండింగ్ లేకుండా ట్యాక్స్ చెల్లించాలి’ 

image

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!