News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 24, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన

ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. సుమారు 250 మంది విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని, క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. లక్షల ఫీజులు చెల్లించినా రుచిలేని భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 24, 2025
SRCL: ‘ప్రజల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

బాధితుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News November 24, 2025
ఏలూరు: పీజీఆర్ఎస్కు 277 ఫిర్యాదులు

పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 277 అర్జీలు స్వీకరించామన్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.


