News February 2, 2025

జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 24, 2025

కదిరి ఆలయంలో సర్వమత ప్రార్థనలపై వీహెచ్‌పీ ఆగ్రహం

image

కదిరి నారసింహుని ఆలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్యమత ప్రార్థనలు చేయించడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. శాస్త్ర విరుద్ధంగా క్రైస్తవ పాస్టర్, ముస్లిం మౌల్వీలతో ప్రార్థనలు చేయించడం హిందూ ధర్మానికి అపచారమని వీహెచ్‌పీ నేత సత్య రవికుమార్ మండిపడ్డారు. ఆలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయ పవిత్రతను దెబ్బతీయడం తగదన్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News December 24, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ రూ.10,000 పెరిగి రూ.2,44,000కు చేరింది. గత 5 రోజుల్లోనే రూ.23వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,38,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,27,350 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 24, 2025

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి HMDA సిద్ధం

image

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు HMDA సిద్ధమవుతోంది ORR నుంచి ప్రాంతీయ రోడ్లకు అనుసంధానం చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. బుద్వేల్ నుంచి 165 రహదారి వద్ద కోస్గి వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ రూపొందించే పనిలోపడ్డారు. డీపీఆర్ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. 81 కి.మీ పొడవుతో, 4 లైన్లుగా రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.