News June 25, 2024
జడ్చర్ల: గొర్రెల కాపరి హత్య కేసులో వీడిన మిస్టరీ

గొర్రెల కాపరిని భార్యే హత్య చేయించినట్లు జడ్చర్ల CI ఆదిరెడ్డి తెలిపారు. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, చిన్న ఆంజనేయులు(46) దంపతులు. పెద్ద కుమార్తె ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో తండ్రి మందలించాడు. ఈ విషయంలో కుమార్తె, భార్యను కొట్టాడు. దీంతో భాగ్యలక్ష్మి భర్త హత్యకు ప్లాన్ చేసింది. మూడు మేకలు ఇస్తానని కాళ్ల మైసమ్మతో ఒప్పందం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 21న ముగ్గురు కలిసి హత్య చేశారు.
Similar News
News February 14, 2025
కౌకుంట్ల: బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌కి కౌకుంట్ల మండలంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మండలంలోని ముచ్చింతల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణారెడ్డి, పుట్టపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కురుమూర్తి, శేఖర్ తదితరులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
News February 14, 2025
చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.
News February 14, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడు షబ్-ఎ-బరాత్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా “షబ్-ఎ-బరాత్”కు ముస్లింలు అన్ని మస్జిద్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. షాబాన్ నెలలో 15వ(నేడు) రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ ఆరాధనలు చేస్తూ, తమ కోసం, తమ ప్రియమైనవారి కోసం అల్లాహ్ దయను కోరుతూ గడుపుతారు. షబ్-ఎ-బరాత్‌ను క్షమాపణ రాత్రి లేదా ప్రాయశ్చిత్త దినం అని కూడా పిలుస్తారు.