News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News November 7, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో సామూహిక ‘వందేమాతరం’

image

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ వద్ద సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్ పాల్గొన్నారు. వందేమాతరం గేయం పవిత్ర గీతం అని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News November 7, 2025

అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

image

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్‌(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

News November 7, 2025

రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.