News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News December 4, 2025
WNP: మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం: కలెక్టర్

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడమే కీలకమని అన్నారు.
News December 4, 2025
మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 4, 2025
పీయూలో ఎన్ఎస్ఎస్ ఒరియంటేషన్ కరపత్రం ఆవిష్కరణ

డిసెంబర్ 10న పాలమూరు యూనివర్సిటీలో Challenges Facing by Women and Youth అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఒరియంటేషన్ కార్యక్రమం జరుగనుందని వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. బ్రోచర్ను రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా మెల్బోర్న్ నుంచి BYM ఫౌండర్ ప్రొఫెసర్ సరోజ గుళ్లపల్లి పాల్గొననున్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, పీవో డా.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


