News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News November 15, 2025
బిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. బిక్కనూర్కు చెందిన తిరుమల రాజయ్య(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
News November 15, 2025
PDPL: నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహణ: రాజశేఖర్

PDPL కలెక్టరేట్లో నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్స్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ 60, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ 4, హెచ్ఆర్ 2, ఆఫీస్ బాయ్ 1 పోస్టులకు అవసరమైన అర్హతలు ఇంటర్, డిగ్రీ, డిప్లమా, అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, పదో తరగతి. అభ్యర్థులు 19న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్తో హాజరై నమోదు చేసుకోవాలన్నారు.
News November 15, 2025
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన MHBD ఎమ్మెల్యే

సాధారణ ప్రజా ప్రతినిధిలా కాకుండా, సమాజ సేవలో తన వృత్తి విలువలను కలిపి పని చేయడం మానుకోట ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రత్యేకత. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో నేరుగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని విద్యార్థులకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే పదవి ఉన్నా, సర్వసాధారణ వైద్యునిలా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు.


