News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News December 8, 2025
FLASH: సూర్యాపేట: నకిలీ బంగారం ముఠా ARREST

తక్కువ ధరకు బంగారం ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. హనుమకొండకు చెందిన వెంకటేశ్వర రావు నుంచి రూ.12 లక్షలు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టినట్లు ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈ మోసంలో నలుగురు నిందితులు (నరేశ్, ఆదినారాయణ, యోగిరెడ్డి, నాగిరెడ్డి) అరెస్టు అయ్యారు. నకిలీ బంగారాల ప్రకటనలను నమ్మవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 8, 2025
ప్రమాదాల నివారణకు SP చర్యలు.. 9 టీమ్లు రెడీ!

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో పోలీసులు, నేషనల్ హైవే, మోటార్ వెహికల్ సిబ్బంది, వాలంటీర్లు ఉంటారు. ఈ బృందాలకు డీపీఓలో శిక్షణ ఇచ్చారు. పెనుమూడి, చీరాల, మేదరమెట్ల వంటి కీలక ప్రాంతాలలో ఈ బృందాలు పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు.
News December 8, 2025
ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితం: కలెక్టర్

ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని, గోనె సంచులు తెచ్చుకున్న వారికి అధికారులే నగదు చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయించడానికి రైతులే స్వయంగా గోనె సంచులు తెచ్చుకుంటే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.


