News January 31, 2025
జడ్చర్ల: చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి

జడ్చర్ల మండలం మూల స్తంభం తండాకు చెందిన రాథోడ్ తరుణ్ నాయక్ (29) పొట్టకూటి కోసం కుటుంబంతో కలిసి తాండూర్‌కు వలస వెళ్లాడు. అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం పోస్ట్ ఆఫీస్‌లోని చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
News April 24, 2025
భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణపేట 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. మున్నుందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
News April 24, 2025
వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్‌లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.