News August 4, 2024

జడ్చర్ల: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

image

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. పట్టణంలోని గణేశ్ నగర్ కాలనీ సమీపంలో చెరువులో పడి మ్యాకల శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదవశాత్తు మరణించాడా.? ఆత్మహత్యకు పాల్పడ్డాడా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 17, 2024

మహబూబ్‌నగర్: హైడ్రా ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అనేక అక్రమ భవనాలు కూల్చివేయడంతో ఉమ్మడి పాలమూరులో భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 11,360 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.23.81 కోట్ల ఆదాయం సమకూరగా.. ఆగస్టు నెలలో 7,315 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం గమనార్హం.

News September 17, 2024

వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరారు.. గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ ​వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు

News September 17, 2024

MBNR: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞సురవరం <<14119741>>ప్రతాపరెడ్డి <<>>జన్మించిన గ్రామం? – ఇటిక్యాలపాడు
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు? – కోయిల్‌సాగర్
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు? – రామకృష్ణశర్మ
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు? – రాజా పెద్ద సోమభూపాలుడు, 1666
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? – రాజా బహిరీ గోపాలరావు
SHARE IT..