News March 29, 2025
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బౌహినియా అక్యుమినాటా మొక్క

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో ఉన్న బౌహినియా అక్యుమినాటా మొక్కకు అద్భుతమైన పుష్పం కనువిందు చేస్తోంది. డిగ్రీ కాలేజీలో ఉన్న తెలంగాణ బొటనికల్ గార్డెన్‌లో ఈ మొక్క ఉంది. తెల్ల బంగారం చెట్టును తెలుపు దేవకాంచనం అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం బహీనియా అక్యూమినటా. దేవ కాంచనం చెట్టు వలె కనిపించే ఈ చెట్టు పుష్పాలు తెల్లగా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
Similar News
News November 17, 2025
కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.