News October 24, 2024
జడ్చర్ల: మద్యం లోడ్ కంటైనర్ బోల్తా.. ఎగబడ్డ జనం

మద్యం లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడటంతో జనం ఎగబడ్డారు. పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు మద్యం లోడుతో వెళ్తున్న కంటైనర్ జడ్చర్లలో హైవే- 44పై జంజం హోటల్ వద్ద ఆగి ఉండగా మరో లారీ ఢీకొట్టింది. దీంతో కంటైనర్ బోల్తా పడటంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లు చెల్లాచెదురయ్యాయి. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మందు బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులను చెదరగొట్టారు.
Similar News
News December 22, 2025
MBNR: ప్రజావాణి..11 దరఖాస్తులు: ఎస్పీ

MBNR జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ జానకి స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 11 దరఖాస్తులు అందగా, వాటిని ఎస్పీ శ్రద్ధగా పరిశీలించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా కేసులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
News December 22, 2025
MBNR: సేవా దృక్పథానికి నిదర్శనం జి.వెంకటస్వామి: ఎస్పీ: ఎస్పీ

సామాజిక అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన దివంగత మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అందరికీ చిరస్మరణీయుడని జిల్లా ఎస్పీ జానకి పేర్కొన్నారు. సోమవారం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ప్రదర్శించిన సేవాభావం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమని కొనియాడారు.
News December 21, 2025
MBNR: సైబర్ మోసం జరిగితే ‘మొదటి గంట’ కీలకం: ఎస్పీ

సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోతే.. బాధితులు మొదటి గంటలో (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. త్వరగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సైబర్ కేసుల విచారణలో ప్రతిభ చాటిన జిల్లా D4C సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


