News June 14, 2024

జడ్పీటీసీ పదవికి విరుపాక్షి రాజీనామా

image

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విరుపాక్షి చిప్పగిరి మండల జడ్పీటీసీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సృజనకు అందించారు. విరుపాక్షి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జడ్పీటీసీ ఎన్నికల్లో చిప్పగిరి మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News September 16, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

image

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

News September 16, 2024

హోళగుందలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

image

హోళగుంద అయోధ్య నగర్ కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభాలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు, మూగజీవాలు సంచరించే ప్రదేశంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను మార్చాలని వారు కోరారు.

News September 15, 2024

నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు

image

నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.