News September 23, 2024

జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో వెంకట్రామన్ బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో కీలక ఉద్యోగుల బదిలీలపై ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవోగా పనిచేస్తున్న రావాడ వెంకట రామన్‌ను విజయనగరం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజాను శ్రీకాకుళం జిల్లా పరిషత్ నూతన సీఈవోగా నియమించారు.

Similar News

News October 31, 2025

‘ఉద్యోగంలో చేరేందుకు..ఆ టీచర్‌కు 10 రోజులే డెడ్ లైన్’

image

పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌ (జీవ శాస్త్రం) అంగూరు చంద్రరావు 2022 నుంచి విధులకు గైర్హజరయ్యారు. దీనిపై పలు మార్లు హెచ్‌ఎంకు డీఈవో నోటీసులిచ్చినా వివరణ ఇవ్వలేదు. ఈ ఏడాది MAR’3వ తేదీన ఇచ్చిన చివరి నోటీసుకు ఉద్యోగి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోగా నేటి వరకు విధుల్లో చేరలేదు. 10 రోజుల గడువులో హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని డీఈవో రవిబాబు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.

News October 31, 2025

SKLM: ‘డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలి’

image

డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 32 అభ్యర్థుల్లో 10 మందిని డ్రైవింగ్ శిక్షణకు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 31, 2025

కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని ఒకరు సూసైడ్

image

కోటబొమ్మాళి(M) నరసింగపల్లిలోని తోటల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.