News February 25, 2025

జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ను కలెక్టర్ అభినందించారు.

Similar News

News February 26, 2025

భూపాలపల్లి: శివరాత్రి ఉత్సవాలకు భారీగా పోలీసులు 

image

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంలో పోలీసులతో సమావేశమై మాట్లాడుతూ ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 208 మంది కానిస్టేబుల్స్ ఉన్నట్లు తెలిపారు. మూడు చోట్లలో భక్తులకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.

News February 26, 2025

మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 14,224 మంది

image

మెదక్ జిల్లాలో 14,224 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 26, 2025

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : BR నాయుడు

image

శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇటీవల ఛైర్మన్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి వాట్సాప్ ద్వారా చేసిన దానిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఊపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.

error: Content is protected !!