News March 18, 2024

జనగాం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 22, 2024

BREAKING.. ములుగు: అన్నదమ్ములను హతమార్చిన మావోలు

image

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.

News November 21, 2024

గిరిజన వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో గిరిజన జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే గిరిజన వర్కింగ్ జర్నలిస్టులు తమ పేర్లను సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు.

News November 21, 2024

పోలీస్‌ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే రీతిలో ప్రజాసేవకు అంకితం కావాలి: సీపీ

image

తోమ్మిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న 246 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ (సివిల్‌) పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను(దీక్షాంత్‌ పరేడ్‌) గురువారం మడికొండలోని సిటి పోలీస్‌ శిక్షాణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షిస్తూ, పోలీస్‌ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించే దిశగా నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళకు పిలుపునిచ్చారు.