News April 3, 2025
జనగాం యువతకు కలెక్టర్ సూచనలు

యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగించుకోవాలన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఆసక్తి గల వారు ఆన్లైన్లో https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో అందజేయాలన్నారు.
Similar News
News November 15, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.
News November 15, 2025
ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.
News November 15, 2025
భద్రకాళి చెరువులో అద్దాల వంతెన!

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఒక కొత్త అనుభూతి రానుంది. భద్రకాళి చెరువు మధ్యలో ఏర్పాటు చేసే ఐలాండ్ నుంచి చెరువు బండ్ వరకు అద్దాల వంతెన ఏర్పాటుకు అడుగు పడింది. కిలో మీటర్ రోప్ వే, 250 మీటర్ల అద్దాల వంతెన కోసం పలు సంస్థలు శుక్రవారం ప్రజెంటేషన్లు ఇచ్చాయి.దాదాపు రూ.70 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని కుడా అధికారులు భావిస్తున్నారు. దీంతో WGL పర్యాటకానికి కొత్త పుంత రానుంది.


