News February 25, 2025

జనగాం: వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి: కలెక్టర్

image

రాబోయే వేసవిలో క్షేత్ర స్థాయిలో నిరంతరం విద్యుత్ ఉండాలని, దాని కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు జనగాం సూర్యాపేట రోడ్డులో ఉన్న 33/11 సబ్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఫీడర్ల వారీగా, LV అంతరాయాలను సమీక్షించారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News December 13, 2025

AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

image

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.

News December 13, 2025

ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

image

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.

News December 13, 2025

వేములవాడ: మార్కెట్ ఛైర్మన్‌పై దాడి.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు: SP

image

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై ఈ మేరకు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. రాజకీయ కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు.