News February 25, 2025
జనగాం: వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి: కలెక్టర్

రాబోయే వేసవిలో క్షేత్ర స్థాయిలో నిరంతరం విద్యుత్ ఉండాలని, దాని కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు జనగాం సూర్యాపేట రోడ్డులో ఉన్న 33/11 సబ్ స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఫీడర్ల వారీగా, LV అంతరాయాలను సమీక్షించారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News March 20, 2025
సూర్యాపేట: 90 వేల మంది రైతులకు జమ కానున్న డబ్బులు

రైతు భరోసాకు ఈ బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటికే మూడు ఎకరాలలోపు ఉన్న 1.50 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందాయి. ఇక మిగిలిన 90వేల మంది రైతులకు డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.
News March 20, 2025
పిఠాపురం సభపై పవన్ కళ్యాణ్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు .
News March 20, 2025
భూపాలపల్లి: కాళేశ్వరానికి భారీ నిధులు

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్‌లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.