News April 2, 2025
జనగాం: సర్వాయి పాపన్న వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాధికారం దిశగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.
Similar News
News October 29, 2025
పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించి NOV 1-7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. చెత్తసేకరణ, నీటినిల్వ నివారణ, పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనుమతిలేని నిర్మాణాలపై చర్యలుంటాయని అన్నారు.
News October 29, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్.. 9 గేట్ల ద్వారా నీటివిడుదల

ఎగువన కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 148.00 మీటర్లుగా, నీటి నిల్వ 20.1754 టీఎంసీలుగా నమోదైంది. మొత్తం ఇన్‌ఫ్లో 73,089 క్యూసెక్కులు కాగా, అంతే అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో శ్రీరాం సాగర్ నుంచి 50,000, కడెం నుంచి 4,744 క్యూసెక్కుల ప్రవాహం ప్రవేశిస్తోంది. ప్రాజెక్ట్‌లో 62 గేట్లలో 9 గేట్లు తెరిచి 72,801 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
News October 29, 2025
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వికారాబాద్ ఎస్పీ

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ పోలీసు అధికారులకు వాగులు, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని, రాకపోకలకు ఆటంకం కలిగించే రోడ్లు వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.


