News February 7, 2026

జనగామను వీడిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్

image

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్ఓ లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News March 17, 2026

TU: కొనసాగుతున్న M.Ed మూడవ సెమిస్టరు పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఎడ్ (M.Ed) 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ‘ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పరీక్షకు 29 మంది విద్యార్థులకు 28 మంది విద్యార్థులు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.

News March 17, 2026

GNT: ఐదుగురు సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్

image

గుంటూరు రేంజ్‌కు చెందిన ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. షేక్ అబ్దుల్ బషీర్, పి.బాలాజీ, బి.నరసింహారావు, జి.తిరుమలరావు, ఆలహరి శ్రీనివాస్‌లకు ఈ ప్రమోషన్ దక్కింది. వీరంతా వెంటనే మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. ప్రమోషన్ పొందిన వారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.

News March 17, 2026

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి: అన్నమయ్య SP

image

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తమ కష్టార్జితాన్ని కాపాడుకోగలరని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక ముఖ్యమైన సందేశాన్ని విడుదల చేశారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికగా జరుగుతున్న అక్రమాలపై SP ప్రజలకు పలు సూచనలు చేశారు. వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చేవి నమ్మకూడదన్నారు.