News January 25, 2025
జనగామలో రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతిపై సందేశం, విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానోత్సవం, స్టాల్స్ ప్రదర్శన, కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు.
Similar News
News November 28, 2025
HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
పెద్దపల్లి: మొదటి రోజు 76 నామినేషన్లు

జిల్లాలో మొదటి విడతలో కాల్వ శ్రీరాంపూర్, కమాన్పూర్, మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లోని 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి రోజు గురువారం 76 నామినేషన్ దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. జిల్లాలో 896 వార్డులకు 37 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. కులం, నివాసం సర్టిఫికెట్లు లేని పక్షంలో కనీసం మీసేవలో దరఖాస్తు చేసిన రశీదులను జోడించాలన్నారు.
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.


