News January 11, 2026
జనగామ: అక్రమాలకు నిలయాలు.. మీసేవ కేంద్రాలు!

జిల్లాలోని పలు మీ సేవ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్ణీత రుసుములకంటే అధికంగా వసూలు చేస్తూ, భూ భారతి స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ల జారీ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారని సమాచారం. కొందరు నిర్వాహకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై దళారులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మీసేవ కేంద్రాలు, భూ భారతి ఆపరేటర్లపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News January 15, 2026
KKRపై చర్యలకు సిఫారసు.. తిరస్కరించిన ముస్తాఫిజుర్

IPL నుంచి BAN ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను KKR తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొటెస్ట్ చేసి కాంపెన్సేషన్ డిమాండ్ చేయాలని అడిగితే ముస్తాఫిజుర్ తిరస్కరించాడని BAN క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Md మిథున్ వెల్లడించారు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాలతో కాంట్రాక్ట్ రద్దు చేస్తే చర్యలు తీసుకోవచ్చని వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ చెప్పిందని, కానీ ముస్తాఫిజుర్ వద్దనడంతో వెనక్కి తగ్గామన్నారు.
News January 15, 2026
మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN

AP: తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్, విశాఖకు బీచ్‌కు ప్రసిద్ధి అని CM చంద్రబాబు అన్నారు. ఈ మూడింటినీ మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్‌గా మారుతుందని నారావారిపల్లెలో మీడియాతో పేర్కొన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని చెప్పారు.
News January 15, 2026
బాపట్ల: త్రిపురనేని రామస్వామికి చౌదరికి నివాళి

నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి, సమానత్వం వైపు అడుగులు వేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి జీవితం స్ఫూర్తి అని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతిని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.


