News October 6, 2024

జనగామ: అదృష్టం అంటే ఈవిడదే.. పోయిన బంగారం మళ్లీ దొరికింది

image

పోగొట్టుకున్న బంగారాన్ని ఓ వృద్ధురాలు మళ్లీ పొందగలిగింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన సోమలక్ష్మి అనే వృద్ధురాలు.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ బియ్యం సంచిలో 5 తులాల బంగారం దాచింది. అయితే గ్రామంలో ఓ వ్యక్తికి ఆబియ్యంను విక్రయించింది. బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి మరుసటి రోజు మళ్లీ రాగా అతనికి విషయం చెప్పింది. బియ్యం సంచుల్లో వెతకడంతో బంగారం దొరికింది.

Similar News

News November 4, 2024

మహబూబాబాద్ జిల్లాలో నేడు మీసేవ కేంద్రాలు బంద్

image

మహబూబాబాద్ జిల్లాలో ఉన్న మీ సేవ కేంద్రాలు సోమవారం తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు మీసేవా కేంద్రాల జిల్లా అధ్యక్షుడు దేశబోయిన అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహిస్తున్న మీసేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం యథావిధిగా మీసేవ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించారు.

News November 4, 2024

వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు పునఃప్రారంభం కానుంది. వరుసగా 4 రోజుల సెలవులు (గురువారం దీపావళి, శుక్రవారం అమావాస్య, శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో) మార్కెట్‌ బంద్ అయింది. దీంతో సోమవారం నుంచి మార్కెట్ పున:ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.

News November 3, 2024

పదో తరగతికి స్టడీ అవర్స్ నిర్వహించాలి: DEO

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, అన్ని యాజమాన్యాల పాఠశాలలు జనవరి 10 వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని DEO జ్ఞానేశ్వర్ అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4:15 గంటల నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులను హెచ్ఎంలు పర్యవేక్షించాలన్నారు. అనంతరం జనవరి 11 నుంచి మార్చి వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు.