News February 26, 2025
జనగామ: అన్ని పాఠశాలలకు జిల్లా అధికారి ఆదేశాలు

ఈనెల 28న జనగామ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. సైన్స్ ప్రాముఖ్యతను తెలిపేలా వివిధ రకాల పోటీలను నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ ప్రోత్సాహంతో బహుమతులు అందజేయాలని సూచించారు. వివరాలకు 9441453662 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Similar News
News March 23, 2025
జూన్‌లో సూర్య-అట్లూరి మూవీ షురూ?

వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య నటించనున్న సినిమా జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ప్రీప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే లేదా కయాదు లోహర్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మూవీని నాగవంశీ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.
News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్‌తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
News March 23, 2025
IPL-2025: 300 స్కోర్ లోడింగ్?

ఉప్పల్‌లో SRH బ్యాటర్ల ముందు బౌండరీలు చిన్నబోతున్నాయి. ఫోర్లు, సిక్సులే లక్ష్యంగా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతుండటంతో 17 ఓవర్లకు స్కోర్ 230 దాటింది. ఈ క్రమంలో IPL చరిత్రలో తొలిసారి 300 స్కోర్ చేసే ఛాన్స్ కన్పిస్తోంది. గత సీజన్లో ఇదే SRH జట్టు బెంగళూరుపై లీగ్ చరిత్రలో 287/3 భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఓవర్ నుంచే బ్యాటర్లు హిట్టింగ్ ప్రారంభించగా RR బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.