News February 6, 2025
జనగామ: ఆకర్షణీయంగా వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు

నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా పశుసంవర్థక శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు, సాంకేతిక ఉత్పత్తులు తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు స్టాళ్లు ఆకర్షణీయంగా మారాయి.
Similar News
News October 24, 2025
శేష వాహనంపై కురుమూర్తి రాయుడు

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపులో దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ల గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనమని భక్తులు విశ్వసిస్తారు.
News October 24, 2025
FLASH: సిద్దిపేట జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 25 నుంచి నవంబర్ 9 వరకు సిటీ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు అనుమతులు లేకుండా నిర్వహించకూడని చెప్పారు. బలవంతంగా వ్యాపార సముదాయాలు మూయించడం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 24, 2025
జిల్లా జైలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించి, ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని ఒక పరివర్తన కేంద్రంగా భావించాలని, కారాగారంలో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశాలకు లోనుకాకుండా ఉండాలని తెలియజేశారు.


