News March 1, 2025

జనగామ: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: శాంతి కుమారి

image

హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (దృశ్య మాధ్యమం) ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ప్రశ్నపత్రాల తరలింపును పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టాలన్నారు.

Similar News

News November 22, 2025

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులు

image

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in

News November 22, 2025

సూర్యాపేట: ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కృషి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనదారుడి భద్రత ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.

News November 22, 2025

నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

image

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>