News March 1, 2025
జనగామ: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: శాంతి కుమారి

హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (దృశ్య మాధ్యమం) ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. ప్రశ్నపత్రాల తరలింపును పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టాలన్నారు.
Similar News
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
News March 15, 2025
శ్రీ సత్యసాయి: ఇంటర్ పరీక్షలకు 218 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-3 ప్రశ్నాపత్రం ద్వారా పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈవో రఘునాథ్ రెడ్డి శనివారం తెలిపారు. జనరల్ విద్యార్థుల్లో 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ విద్యార్థులలో 785 మంది విద్యార్థులకు గాను 747 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. మొత్తం 218 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
News March 15, 2025
జమ్మికుంట: రైల్వేపట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలు

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్- పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన యువతీ, యువకుడి మృతదేహాలు కలకలం రేపాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రేమజంటగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు మృతదేహాల వద్ద పంచనామా నిర్వహించి, వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.