News March 12, 2025
జనగామ: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి, పరీక్ష జరుగుతోన్న విధానాన్ని పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు? గైర్హాజరయ్యారనే వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు.
Similar News
News March 25, 2025
క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం జిల్లా కలెక్టర్

MBNR జిల్లావ్యాప్తంగా 2,087 మందికి టీబీ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి చికిత్స అందించడంతో 1,218 మంది బాగుపడ్డారని ఇందుకుగాను రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం జిల్లాకు మొదటి స్థానం ఇచ్చిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వివరించారు. మిగిలిన 1,767 మంది రోగులకు నెలకు రూ.వేయి చొప్పున వారికి చెల్లిస్తున్నామన్నారు.
News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
News March 25, 2025
ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.