News February 16, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డిఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్లో 573 మంది విద్యార్థులకు గాను 509 విద్యార్థులు హాజరైయ్యారు. రెండవ సెషన్లో 397 మంది విద్యార్థులకు గాను 377 విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Similar News
News October 14, 2025
వరంగల్: వాట్ అన్ ఐడియా సర్ జీ..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 108 గజాల స్థలం, ఇంటిని కేవలం రూ.500 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. 3 వేల కూపన్లు ముద్రించామని వచ్చే ఏడాది జనవరి 15న గుంజేడు ముసలమ్మ దేవస్థానం వద్ద డ్రా తీయనున్నట్లు చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజులను విజేత భరించాలని పేర్కొన్నాడు.
News October 14, 2025
BREAKING: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
News October 14, 2025
HYD: కొత్త మద్యం పాలసీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మద్యం పాలసీపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే దరఖాస్తు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేశారు.