News February 17, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలియజేశారు. మొదటి సెషన్లో 161 మంది విద్యార్థులకు గాను 153 విద్యార్థులు హాజరయ్యారు. రెండో సెషన్లో 195 మంది విద్యార్థులకు గాను 186 విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.
Similar News
News December 6, 2025
భీమవరం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి- కలెక్టర్

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 6, 2025
హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.
News December 6, 2025
కుల్కచర్ల: రాతపూర్వక హామీ ఇస్తేనే సర్పంచ్ పదవి !

కుల్కచర్ల మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం సరికొత్త మలుపు తిరిగింది. నామినేషన్లు దాఖలు చేసిన 338 మంది అభ్యర్థులకు ఓటర్ల నుంచి ఊహించని డిమాండ్ ఎదురవుతోంది. ఎన్నికల హామీలను ఇకపై కేవలం మాటల్లో చెబితే నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు. గ్రామ అభివృద్ధికి హామీలను పేపర్పై రాసి ఇస్తేనే సర్పంచ్ పదవి దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో రాతపూర్వక హామీలపై అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు.


