News February 16, 2025

జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డిఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో 573 మంది విద్యార్థులకు గాను 509 విద్యార్థులు హాజరైయ్యారు. రెండవ సెషన్‌లో 397 మంది విద్యార్థులకు గాను 377 విద్యార్థులు హాజరయ్యారన్నారు.

Similar News

News March 27, 2025

జనగామ: సెర్ప్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్  

image

సెర్ప్ సీఈవో డి. దివ్య దేవరాజన్‌తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎన్ లోకేశ్ కుమార్ సెర్ప్ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనగామ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు. సెర్ప్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. 

News March 27, 2025

KMR: కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన ఎస్పీ

image

KMR జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం పరిశీలించారు. సిబ్బంది ఏ విధంగా ఈ-చలాన్ వేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేశారన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తే జరిమాన విధిస్తామన్నారు.

News March 27, 2025

IT కంపెనీలు, ఉద్యోగులకు Shocking News

image

దేశీయ IT కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్‌ను మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్‌లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60% ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester తెలిపింది. గతంలో 3-5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టనుంది.

error: Content is protected !!