News February 17, 2025

జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 30, 2025

‘రామగుండం అభివృద్ధి.. గడువులోగా పూర్తి చేయండి’

image

RMGలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. RMG మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TUFIDC సహా వివిధ పథకాల కింద జరుగుతున్న పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

News October 30, 2025

KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

News October 30, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.