News February 18, 2025

జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 31, 2025

నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.

News October 31, 2025

వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

image

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

News October 31, 2025

FLASH.. FLASH.. హనుమకొండ: పెళ్లి వాహనానికి యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

హనుమకొండ(D)భీమదేవరపల్లి(M) ముల్కనూర్ PS పరిధి గోపాలపురం దగ్గర ఈరోజు తెల్లవారుజామున 2.20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్(D) కురవి(M) సైదాపురం గ్రామానికి చెందిన 21మంది నల్లపూసల తంతు ముగించుకుని పెళ్లి వాహనం (బొలేరో)లో సిద్దిపేట నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గోపాలపురం దగ్గర వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. వారిని వరంగల్ MGMకు అంబులెన్స్‌లో తరలించారు.