News February 18, 2025

జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 15, 2026

కర్నూలులో ‘ఆకలి కేక’

image

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.

News March 15, 2026

అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

image

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.

News March 15, 2026

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్‌-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.