News March 19, 2025
జనగామ: ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు

జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
Similar News
News November 28, 2025
ఏలూరు: మరో మూడు రోజులే గడువు

పీఎంఏవై (గ్రామీణ) – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేనివారు, స్థలం లేని నిరుపేదలు, అసంపూర్తిగా ఇళ్లు ఉన్నవారు ఈ నెల 30లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.
News November 28, 2025
వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


